శ్రీరాముడి ఆశీర్వాదం అందరికీ కావాలి : కేజ్రీవాల్ 

శ్రీరాముడి ఆశీర్వాదం అందరికీ కావాలి : కేజ్రీవాల్ 

అయోధ్యలో నేడు రామమందిర భూమిపూజ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.  శ్రీరాముని ఆశీర్వాద బలంతో భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించిందని కేజ్రీవాల్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. అయోధ్య భూమిపూజ సందర్భంగా యావత్ దేశానికి శుభాభినందనలు.... శ్రీరాముని ఆశీర్వాదం అందరికీ కావాలని సీఎం కేజ్రీవాల్ అన్నారు.  "రాముడి  ఆశీర్వాదంతో మన దేశం ఆకలి, నిరక్షరాస్యత, పేదరికం నుంచి బయటపడి, ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన దేశంగా నిలవాలి. ప్రపంచానికే భారత్‌ మార్గదర్శకత్వం వహించే రోజు రావాలి. జై శ్రీరామ్‌!'' అని ట్విటర్‌లో ప్రకటించారు కేజ్రీవాల్.