కేసీఆర్ యాదాద్రి పర్యటన: భారీ ఏర్పాట్లు 

కేసీఆర్ యాదాద్రి పర్యటన: భారీ ఏర్పాట్లు 

సీఎం కేసీఆర్ ఈరోజు యాదాద్రిలో పర్యటించబోతున్నారు. యాదాద్రిలో బాలాలయంలో స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.  సీఎం పర్యటన కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది పోలీస్ డిపార్ట్మెంట్.  ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరి 11 గంటలకు సీఎం యాదాద్రి చేరుకుంటారు.  సీఎం పర్యటన సందర్భంగా యాదాద్రి జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్, డిసిపి నారాయణ రెడ్డిలు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.   ఇప్పటికే దాదాపుగా 90శాతానికి పైగా ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.  శివాలయ నిర్మాణం కూడా పూర్తయింది.  ఇక కొండ కిందిభాగంలో భక్తులకోసం మరో పుష్కరిణిని ఏర్పాటు చేస్తున్నారు.  సీఎం కేసీఆర్ క్షేత్రస్తాయి పనులను పరిశీలించిన తరువాత ఆలయ ఉద్ఘాటన ముహుర్తాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది.  ఫిబ్రవరి నెలలోనే ఆలయాన్ని పునర్ ప్రారంభించాలి అనుకున్నా, పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది.