రేపు సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం...వీటిపైనే చర్చ

రేపు సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం...వీటిపైనే చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు మధ్యాహ్నం మరో కీలక సమావేశం నిర్వహించనున్నారు.  యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంట సాగు విధానం, గ్రామాల్లోనే పంట కొనుగోలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో రేపు రెండున్నర గంటలకు ఈ సమీక్ష జరగనుంది. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. యాసంగిలో ఏ పంట వేయాలి..? ఏ పంట వేయొద్దు..? ఏ పంట వేస్తే కలిగే లాభనష్టాలు వంటి విషయాలపై..సీఎం అధికారులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో మక్కల సాగుపై సమీక్ష జరపనున్నారు. కరోనా కారణంగా గత యాసంగి పంటలను గ్రామాల్లో కొనుగోలు చేసినట్టుగానే...వర్షాకాలం పంటలను కూడా గ్రామాల్లో కొనే విషయంపై సీఎం చర్చిస్తారు. ఆరు వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి... రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా పంట కొనాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్‌.