నోముల అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

నోముల అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ఇవాళ ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం పాలెం గ్రామంలో జరిగాయి. అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని..నోముల నర్సింహయ్యకు నివాళులర్పించారు. నోముల భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళుర్పించారు సీఎం కేసీఆర్‌. అనంతరం నోముల కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ ఓదార్చారు. సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులు మహముద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. తమ అభిమాన నాయకుడి అంతిమ యాత్రలో పెద్దు ఎత్తున కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.  నార్కట్‌ పల్లి కామినేని ఆస్పత్రిలో భద్రపరిచిన నోముల భౌతిక కాయాన్ని ఇవాళ ఉదయం 7.30 గంటలకు మొదట నకిరేకల్‌కు తరలించి... ఆ తర్వాత ఆయన స్వగ్రామమైన పాలెంకు తీసుకెళ్లారు.