లాక్ డౌన్ 5.0 తెలంగాణలో సడలింపులు ఇవే..వీటికి మాత్రం అనుమతి లేదు...!

లాక్ డౌన్ 5.0 తెలంగాణలో సడలింపులు ఇవే..వీటికి మాత్రం అనుమతి లేదు...!

లాక్ డౌన్ 5.0 లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సడలింపుల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కంటెయిన్‌మెంట్‌ జోన్ల వెలుపల ప్రస్తుత పరిస్థితులు. జూన్‌ 7వరకు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆస్పత్రులు,ఔషధ దుకాణాలు మినహా ఇతర దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. ఇక మాల్స్ హోటల్స్ రెస్టారెంట్లలో డైనింగ్ ఫెసిలిటికి కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో డెలివరీకి మాత్రమే అనుమతినిచ్చింది. సినిమాహాళ్ళు,జిమ్,ఆడిటోరియం,ఫంక్షన్ హాల్స్ పై మాత్రం నిషేధం కొనసాగనుంది. కంటెయిన్‌మెంట్ జోన్లలో జూన్‌ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ యథాతథంగా అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కంటైన్మంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్.