ప్రగతిభవన్ లో కేసీఆర్ కీలక సమావేశం... 

ప్రగతిభవన్ లో కేసీఆర్ కీలక సమావేశం... 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్ లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.  రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల మేయర్లు, కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.  ఈ సమావేశంలో కీలక విషయాల గురించి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.  ఇటీవలే రాష్ట్రంలో కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన రెవిన్యూ చట్టం, జీవో 58, 59 లపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.  అదే విధంగా, రెవిన్యూ భూములు, ఇతర భూములకు సంబంధించిన ధరణి  పోర్టల్, వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ క్రమబద్దీకరణ అంశాలను ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.