కేసీఆర్‌ పిలుపు.. ఆలోచించి ఓటు వేయండి...

కేసీఆర్‌ పిలుపు.. ఆలోచించి ఓటు వేయండి...

ఆలోచించి ఓటు వేయాలి అంటూ గ్రేటర్ హైదరాబాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్... ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ... ప్రజలు.. నాయకుల ఆలోచనలు, పనితీరు చూసి ఓటు వేయాలని కోరారు. ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలన్న ఆయన.. సందర్భాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఎవరెవరి వైఖరి ఎలా ఉంది..? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి అని సూచించారు. 

ఇక, టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉండదు. రాజకీయ పార్టీగా పని చేస్తుందని గతంలోనే చెప్పాను.. అందరి అంచనాల్ని తలకిందలు చేసి టీఆర్ఎస్ ముందుకు వెళ్లిందన్నారు కేసీఆర్.. ఆరేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు.. అధికారంలోకి వచ్చిక ఎంతో మెచ్చూరిటీతో టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది అన్నారు. మరోవైపు, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా హైదరాబాద్‌లో ఉన్నవారంతా మా వాళ్లే అని అనుకున్నాం.. హైదరాబాద్‌లో మంచినీటి సమస్యను దాదాపు పరిష్కరించాం.. రాబోయే రోజుల్లో 24 గంటలు మంచినీరు సరఫరా చేస్తామన్నారు కేసీఆర్. ఇక, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మాట్లాడిన సీఎం.. ప్రభుత్వ పథకాలు అందరికీ వర్తింపు చేస్తున్నామని.. ఎలాంటి కులం, మతం అనే విక్షలేదని స్పష్టం చేశారు.