ప్రగతి భవన్ లో సీఎం కుటుంబం వినాయక చవితి పూజలు..!

   ప్రగతి భవన్ లో సీఎం కుటుంబం వినాయక చవితి పూజలు..!

వినాయక చవితి పండగను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం సభ్యులతో కలిసి ప్రగతి భవన్ లో పూజలు చేసారు. వినాయక చవితిని పురస్కరించుకుని ప్రగతి భవన్ లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఈ సంధర్భంగా కేసీఆర్ సతీ సమేతంగా పూజలు చేసారు. పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆయన సతీమణి కూడా పాల్గొని పూజలు నిర్వహించారు. అంతే కాకుండా కొందరు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. వినాయక చవితిని పురస్కరించుకుని ప్రగతి భవన్ లో ముందు జాగ్రత్తగా వైరస్ నివారణ చర్యలు చేపట్టారు.