ప్రధాని మోడీకి లేఖ రాయనున్న సీఎం జగన్..

ప్రధాని మోడీకి లేఖ రాయనున్న సీఎం జగన్..

కరోనా వాక్సినేషన్ పై ప్రధాని మోడీకి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానికి వాక్సిన్ డోసుల ను త్వరగా కేటాయించాలని లేఖ రాయనున్నారు సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. 45 ఏళ్ళు పైబడిన వారికి వాక్సినేషన్ లో ప్రాధాన్యం ఇవ్వాలి అని  నిర్ణయం తీసుకున్నారు.  ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు  తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు నుండి రప్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే రేపటి నుండి కర్ఫ్యూ ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఆర్టీసీ బస్సులను కూడా 12 తర్వాత నడపకూడదని నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. అలాగేఉదయం 11.30 గంటల వరకే కళాశాలల నిర్వహణ ఉండేటట్లు చూసుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.