త్వరలోనే తిరుపతి అభ్యర్థిని ప్రకటించనున్న సీఎం...

త్వరలోనే తిరుపతి అభ్యర్థిని ప్రకటించనున్న సీఎం...

తిరుపతి అభ్యర్థి గురించి సీఎం జగన్ అందరి అభిప్రాయాలు అడిగారు. త్వరలోనే అభ్యర్థిని  సీఎం ప్రకటిస్తారు అని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. అభ్యర్ఖిగా ఎవరిని సీఎం ప్రకటించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు. అయితే అభ్యర్థి గురించి అందరూ తమ అభిప్రాయాలు తెలిపాం అని కాకాని గోవర్థన్ రెడ్డి చెప్పారు. సీఎం ఎవరిని నిలబెట్టినా గెలిపించేందుకు కృషి చేస్తామని చెప్పాం. నిర్ణయాన్ని సీఎం కు వదిలిపెట్టాం అన్నారు. సీఎం ఎవరిని నిర్ణయిస్తే వారిని భారీ మెజార్టితో గెలిపించేందుకు మేము కృషి చేస్తాం. పలానా అభ్యర్థిని నిలబెట్టాలని మేము సూచించలేదు. అక్కడ వ్యక్తుల గురుంచి ఎవరూ ప్రస్తావించలేదు. కానీ పార్టీ పరిస్థితిని సీఎం కు వివరించాం. నియోజక వర్గాల వారీగా మా సమస్యలను సీఎం కు వివరించాం. తిరుపతి అభ్యర్థిత్వం పై సీఎం జగన్ తుది నిర్ణయం  తీసుకుంటారు అని పేర్కొన్నారు.