ఇళ్ల పట్టాల పంపిణీ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

ఇళ్ల పట్టాల పంపిణీ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

ఇళ్ల పట్టాల పంపిణీ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. డిసెంబరు 25న డి–ఫామ్‌ ఇస్తూ, ఇంటి స్థలం పట్టాలు ఇస్తాం అని తెలిపారు. కోర్టు స్టే ఉన్నచోట్ల మినహా, మిగిలిన ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపటనున్నట్లు.. అదే రోజున 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా మొదలుపెట్టనునట్లు చెప్పారు. ప్రతిపక్ష కుటిల రాజకీయాల వల్ల పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం న్యాయపోరాటం చేయాల్సి వస్తోంది.  పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారు. కానీ ఇప్పుడు పేదలకు సెంటు, సెంటున్నర స్ధలం ఇస్తామంటే అడ్డుకుంటున్నారు అని చెప్పిన ఆయన ఈ యుద్ధంలో గెలుస్తాం. దేవుడు మనకు అండగా ఉంటాడు. ఇది చాలా గొప్ప కార్యక్రమం అని అన్నారు. ఇళ్ల స్థలాల కోసం 66,518 ఎకరాలు సేకరించాం. వాటి మార్కెట్‌ విలువ రూ.23 వేల కోట్లు, వారిని మొత్తం 30,68,821 మంది పేదలకు పంచబోతున్నాం అన్నారు. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునే అర్హులకూ 90 రోజుల్లో ఇస్తామన్నారు. ఆ మేరకు 1.20 లక్షల మందికి కొత్తగా జాబితాలో చేర్చాం.. దానిలో 80 వేల మందికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. కాబట్టి వేగంగా ఆ పని చేయండి. డిసెంబరు 10వ తేదీ లోగా భూసేకరణతో పాటు, ప్లాట్ల గుర్తింపు 100 శాతం పూర్తి కావాలి అని అధికారులకు సీఎం జగన్ సూచించారు.