సలాం కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్

సలాం కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్

ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌, నంద్యాలలో ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సలాం అత్తగారు మాబున్నీసాతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కొడుకు, శంషావలి, కూతురు సాజీదాలను తిరుగు ప్రయాణంలో ఏపీఎస్పీ గెస్ట్ హౌస్ వద్ద సీఎం జగన్ పరామర్శించారు. సలాం కుటుంబం ఆత్మహత్య కు కారకులైన దోషులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, కుటుంబానికి అండగా ఉంటామని సలాం అత్త మాబున్నీసాకు ధైర్యం చెప్పి సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి ఇటీవల 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.