మరో కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ శ్రీకారం..

మరో కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ శ్రీకారం..

సీఎం జగన్‌ అభివృద్ధి పథకాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టునున్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు సీఎం జగన్‌ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న ఫిషింగ్‌ హార్బర్లకు సీఎం ఇవాళ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తన సుదీర్ఘ పాదయాత్ర సమయంలో మత్స్యకారుల సమస్యలను స్వయంగా పరిశీలించిన సీఎం జగన్‌ వారి ఇబ్బందులను తొలగించేందుకు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలిదశలో రూ.1510 కోట్లతో నాలుగు ఫిషింగ్‌ హార్బర్లను రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్మానించగా డిసెంబర్‌ రెండో వారంలో ఖరారు కానున్నాయి. మొత్తం 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ. 3 వేల కోట్లు వెచ్చిస్తోంది.