నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే..
నివర్ తుఫాను ప్రభావం ఏపీపై ఎక్కువగానే చూపింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్.. ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ బయలు దేరారు. హెలికాప్టర్లో కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించనున్నారు సీఎం జగన్. అనంతరం 11 గంటల 45 నిమిషాలకు తిరుపతిలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 12 గంటల 45 నిమిషాలకు తిరిగి గన్నవరం పయనం అవుతారు సీఎం జగన్. కాగా.. తుఫాను ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)