ఎవరికీ ఓటు వేయమని చెప్పలేదు..కానీ

ఎవరికీ ఓటు వేయమని చెప్పలేదు..కానీ

కర్ణాటక ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్ధతు తెలపలేదని.. ఏ పార్టీకి ఓటు వేయమని చెప్పలేదని.. కానీ మనకు అన్యాయం చేసిన వారికి వెయ్యొద్దన్నానని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇవాళ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో జైరాత్ ఐరన్ కంపెనీకి సీఎం భూమి పూజ చేశారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన కర్ణాటక ఎన్నికల గురించి మాట్లాడారు. బీజేపీతో అప్పట్లో పొత్తు పెట్టుకుంది సొంత లాభం కోసం కాదని.. న్యాయం చేస్తుందని పొత్తు పెట్టుకున్నాం.. కానీ కడుపు మీద కొట్టారు.. ఐదవ బడ్జెట్‌లో ఏపీ పేరు కూడా ఎత్తలేదు.. అందుకే పోరాటానికి దిగాను.. హక్కుల కోసం పోరాడాలి.. పన్నులు కడుతున్నాం..తిరుపతి, నెల్లూరు, అమరావతి సభలో మోడీ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయన్నారు.. దేశంలో ఏ రాష్ట్రానికి రాని కష్టం ఏపీకి వచ్చిందని.. ధర్మ పోరాటంలో కష్టాలుంటాయని.. అయినా విజయం సాధిస్తామని సీఎం అన్నారు.. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌గా మారుతుందని.. కర్నూలు సిటీ శాటిలైట్ సిటీగా మారుతుందని చెప్పారు.