భూధార్ నా చిరకాల వాంఛ

భూధార్ నా చిరకాల వాంఛ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది... ప్రతి భూమికి ఆధార్ తరహాలో 11 అంకెల భూధార్ నెంబర్‌లు కేటాయిస్తోంది. ఈ నెంబర్ ద్వారా ఆ స్థలానికి సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి... ఇప్పటికే కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా ఇది సక్సెస్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు... ఉండవల్లి ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూసేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... భూధార్ నా చిరకాల వాంఛ అని ప్రకటించారు. అవినీతి రహిత రెవెన్యూ పరిపాలనకు భూధార్ శ్రీకారం చుట్టింది.. హైదరాబాద్‌లో భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాను... భూ ఆధార్ తో మీ భూమి మీజేబులోనే ఉంటుందన్నారు చంద్రబాబు. జియోట్యాగింగ్ సిష్టంతో భూధార్ అనుసంధానం చేసి భూమి లొకేషన్ తెలుస్తోందని... క్యూఆర్ కోడ్ తో యజమాని భూమి ఆయన సెల్‌ఫోన్‌లో నిక్షిప్తమై ఉంటుందని... భూధార్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఆన్ లైన్ లో రైతు వేలిముద్రతో సరిపోతుందన్నారు. 

చుక్కల భూమి పేరుతో 80 వేల కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు ఏపీ సీఎం... నెలరోజుల వ్యవధిలో చుక్కల భూమి సమస్యను పరిష్కరించాలని ఆదేశించానన్నారు. భూదార్ తో భూ యజమానికి ఆస్థికి సెక్యూరిటీ ఉంటుందని... ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సెల్ ఫోన్ తోనే సమస్యలు పరిష్కరించుకొనే అవకాశం ప్రజలకు కల్పిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దయ్యాలు సహితం పించను తీసుకున్నాయని సెటైర్లు వేసిన చంద్రబాబు... రాష్ట్రంలో ఇప్పుడు ఆపరిస్థితి లేదన్నారు. పారదర్శకంగా అవినీతిరహితంగా రాష్ట్రాంలో పరిపాలన కొనసాగుతోందన్నారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి రాష్ట్రంలో ఉండటానికి కారణం టెక్నాలజీతో అనుసంధానం కావడమేనని స్పష్టం చేశారు ఏపీ సీఎం... రాష్ట్రాన్ని కేంద్రం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. అభివృద్దికి, వివాదాలకు కారణం భూమి.. భూవివాదల పరిష్కరానికి భూధార్ చక్కగా ఉపయోగ పడుతుందన్నారు. సుపరిపాలన అందిస్తున్నాం... కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవాలని కోరారు... ప్రభుత్వం రాకపోతే ఎక్కవగా నష్టపోయేది ప్రజలేనని... మా నాయకుడు, మా కులం వాడు అంటూ రాజకీయాలు చేస్తే రాష్ట్రం నష్టపోతుందని సూచించారు.