టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత..

టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత..

కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరులో టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత ఇంటిని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో గ్రామంలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పెద్దదండ్లూరుకు బయలుదేరగా.. ఆయనను జమ్మలమడుగులో పోలీసులు అడ్డుకున్నారు. వారి తీరును నిరసిస్తూ..  అవినాష్ రెడ్డి వైసీపీ కార్యకర్తలతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు.