బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ కు కరోనా .?

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ కు కరోనా .?

బిగ్ బాస్4 ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారింది. షో మొదలైన కొత్తలో ప్రేక్షకులనుంచి విమర్శలు ఎదురుకున్నా...ఇపుడు కాస్త ఆసక్తిగా మారింది. గొడవలు , అల్లర్లు , ఏడుపులు , డ్యాన్స్ లతో హౌస్ మేట్స్ హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి అనారోగ్యం కారణంగా గంగవ్వ బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో హౌస్ మేట కూడా అనారోగ్యంతో బయటకు రానున్నదని తెలుస్తుంది. ఆ హౌస్ మేట్  అనారోగ్యానికి కరోనా కారణమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇంతకు ఆ కంటెస్టెంట్ ఎవరంటే .. సింగర్ నోయల్. గత కొద్దిరోజులుగా నోయల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుస్తుంది. కరోనా సోకవడం వల్ల నోయల్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నదంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీం క్లారిటీ ఇచ్చింది. నోయల్ కు కరోనా పాజిటివ్ అంటూ వచ్చిన వార్తలు నిజం కాదని పేర్కొన్నారు. నోయల్ కు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో అతడిని కొద్ది రోజులు బయటకు తీసుకురానున్నామని బిగ్ బాస్ నిర్వహకులు పేర్కొన్నారు. నోయల్ ఆరోగ్యం కుదుట పడితే రెండు మూడు రోజుల్లోనే అతడు షో కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.