30 ఏళ్ల తరువాత ‘గ్యాంగ్ లీడర్’ బ్యాచ్

30 ఏళ్ల తరువాత ‘గ్యాంగ్ లీడర్’ బ్యాచ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చిరు కెరీర్ లో బెస్ట్ సినిమాలో ఒకటి. ఆయన కెరీర్‌లో (1990’s) ఈ సినిమా చేసిన అద్భుతాలు అన్ని ఇన్ని కావు. విజయ బాపినీడు తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. మురళి మోహన్, శరత్ కుమార్ లు కూడా ప్రముఖ పాత్రలు పోషించారు. కాగా, ఈరోజు చిరు, మురళి మోహన్ , శరత్ కుమార్ లు రామోజీ ఫిల్మ్ సిటీలో అనుకోకుండా కలిశారు ఈ గ్యాంగ్ లీడర్ బ్యాచ్.. చిరు ఆచార్య సినిమాలో, శరత్ మణిరత్నం సినిమాలో, మురళి మోహన్ ఆర్కా మీడియా నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగులు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండటంతో యాదృచ్చికంగా కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.