కరోనాను జయించిన మెగా బ్రదర్ నాగబాబు

కరోనాను జయించిన మెగా బ్రదర్ నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసందే. కాగా గత 14 రోజులుగా చికిత్స తీసుకుంటున్న నాగబాబు తాను కరోనాను జయించానని  తెలిపారు. హోం ఐసోలేషన్ తర్వాత తాను ఎదుర్కొన్న అనుభవాలు తీసుకున్న జాగ్రత్తలు కోలుకున్న విధానాన్ని అభిమానులతో పంచుకున్నారు.ఇప్పటి వరకు తాను ఐదు సార్లు కరోనా టెస్ట్ చేయించుకున్నట్టు తెలిపిన నాగబాబు.. నిహారిక నిశ్చితార్ధానికి ముందు కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నట్టు పేర్కొన్నాడు. అయితే ఇటీవల కాస్త చలి జ్వరంతో పాటు మత్తుగా అనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని అన్నారు నాగబాబు.నాకు గతంలో న్యూమోనియా ఉండడంతో ఆస్పత్రిలో చేరగా.. ఐదురోజులు రెమిడెసివిర్ ఔషధాన్ని ఇచ్చారని నాగబాబు తెలిపారు. జ్వరం ఒళ్లు నొప్పులు తప్ప ఎటువంటి ఇబ్బంది నాకు కలుగలేదని నాగబాబు తెలిపారు.  కరోనా కు ఎవ్వరు అతీతులు కాదని అది అందరికి సోకుతుందని ,తగిన జాగ్రత్తలు తీసుకుంటూ .. సరైన చికిత్సను తీసుకుంటే తగ్గిపోతుందని తెలిపారు. కరోనాకు మందు లేదని.. వైరస్ లోడును బట్టి చికిత్స అందిస్తారని.. కరోనా వైరస్ 14 రోజుల తర్వాత దానంతట అదే చచ్చిపోతుందని నాగబాబు తెలిపారు.