స్నేహితుడికోసం మెగాస్టార్ చేసిన సాయం తెలిస్తే షాక్ అవుతారు ...

స్నేహితుడికోసం మెగాస్టార్ చేసిన సాయం తెలిస్తే షాక్ అవుతారు ...

సీనియర్ నటుడు రాజశేఖర్ కరోనాబారిన పడి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళకరంగా ఉంది.. ఈ విషయాన్ని ఆయన కుమార్తె శివాత్మిక ట్విట్టర్ ద్వారా తెలిపారు... ఈ రోజు ఉద‌యం త‌న తండ్రి ఆరోగ్యం పరిస్థితిపై ట్వీట్ చేసిన శివాత్మిక‌.. నా తండ్రి కరోనాతో ధైర్యంగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని శివాత్మిక పేర్కొంది. 

ఈ ట్వీట్ పై మెగాస్టార్‌ చిరంజీవి స్పందిస్తూ.. నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా... ధైర్యంగా ఉండండి. అంద‌రి ప్రార్ధన‌ల‌తో రాజ‌శేఖ‌ర్ త్వర‌గా కోలుకుంటారు.. అని ట్వీట్ చేసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి రాజశేఖర్ కోసం ఓ ప్రత్యేక వైద్యబృందాన్ని పంపారని తెలుస్తుంది. తన స్నేహితుడి కోసం చిరు ఓ వైద్య బృందాన్ని పంపి చికిత్స చేయిస్తున్నారట. ఎప్పటికప్పుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై చిరు ఆరా తీస్తున్నారట. గతంలో రాజశేఖర్ కు చిరంజీవికి మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. అయినా ఇలాంటి పరిస్థితుల్లో చిరు రాజశేఖర్ కోసం సాయం అందించడం పై అభిమానులు మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.