సింహాన్ని అనుసరిస్తున్న సింహపు పిల్ల : చిరంజీవి

సింహాన్ని అనుసరిస్తున్న సింహపు పిల్ల : చిరంజీవి

సినిమా సెలబ్రెటీలు, క్రికెట్ స్టార్లు అందరూ సోషల్ మీడియాలో ఉంటూ తాము చెప్పాలనుకున్నది అందులో వెల్లడిస్తుంటారు. అదే విధంగా నిన్న ఉగాది సందర్బంగా  సోషల్ మీడియా ట్విట్టర్ లో అడుగు పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన సోషల్ మీడియాకు భారీ ఆహ్వానమే లభించింది. వచ్చినదే తరువుగా వరుస ట్వీట్లతో తన ట్విట్టర్ అకౌంట్ ని హోరెత్తిస్తున్నారు ఆయన. అయితే చిరంజీవి తరువాత ఆయన కుమారుడు అయిన రామ్ చరణ్ కూడా ''ఆల్ వేస్ రామ్ చరణ్'' పేరుతో ట్విట్టర్ అకౌంట్ ని ప్రారంభించారు. ఆ తరువాత వెంటనే ఈ మెగా పవర్ స్టార్ చిరంజీవి, అలాగే పవన్ కళ్యాణ్ ను ఫాలో చేసాడు. అయితే తరువాత మెగాస్టార్ తన కొడుకు రామ్ చరణ్ ను సోషల్ మీడియాకు స్వాగతం పలకడమే కాకుండా ''సింహాన్ని అనుసరిస్తున్న సింహపు పిల్ల'' అని ట్విట్ చేసాడు. అయితే దీనికి చరణ్  థాంక్స్ డాడీ అని రిప్లై ఇచ్చారు. అయితే ప్రస్తుతం చరణ్ కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న చిరంజీవి 152 వ సినిమాలో ఓ కీలక పాత్రా పోషిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయిన విషయం అందరికి తెలిసిందే.