దాసరికి పద్మ పురస్కారం ఇవ్వాలి: చిరంజీవి

దాసరికి పద్మ పురస్కారం ఇవ్వాలి: చిరంజీవి

దర్శకరత్నదాసరి నారాయణరావు జయంతి మే 4. గత నాలుగేళ్ళుగా చిత్రసీమలోని అపరిష్కృత సమస్యలను చూస్తుంటే... అందరికీ దాసరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం నట, దర్శకనిర్మాతగానే కాకుండా చిత్రసీమలో అన్నీ తానై వ్యవహరించిన వ్యక్తి దాసరి నారాయణరావు. వివిధ భాషల్లో 150కి పైగా చిత్రాలను రూపొందించిన దాసరి నారాయణరావుకు పద్మ అవార్డ్ రాలేదంటే ఆశ్యర్యం కలగక మానదు. కానీ ఇది నిజం. కారణాలు ఏవైనా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ పురస్కారాన్ని అందించలేదు. దాసరి జయంతి సందర్భంగా ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకున్నారు. కేవలం ప్రతిభావంతుడైన దర్శకుడిగానే కాకుండా పరిశ్రమలో ఎన్నో సమస్యలను పరిష్కరించిన దాసరి సేవలను గుర్తించి, ఆయన మరణానంతరమైన కేంద్రం అత్యుత్తమమైన పద్మ పురస్కారాన్ని ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 'గురువు గారూ' అని సినిమా రంగానికి చెందిన అందరూ అభిమానంగా పిలుచుకునే దాసరి తాను జన్మించిన మే మాసంలోనే 30వ తేదీ కన్నుమూశారు.