ఐపీఎల్‌ కు వివో నే స్ఫాన్సర్స్... అందులో మార్పు లేదు..

ఐపీఎల్‌ కు వివో నే స్ఫాన్సర్స్... అందులో మార్పు లేదు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  చైన సెల్ ఫోన్ సంస్థ అయిన వివో తో స్పాన్సర్షిప్ ఒప్పందం 2022 వరకు కుదుర్చుకుంది. అయితే జూన్ నెలలో లడఖ్ యొక్క గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 21 మంది భారతీయ సైనికులు మరణించడం తో అందరూ చైనా వస్తువులను బహిష్కరించాలని ఐపీఎల్ కూడా ఆ చైనా కంపెనీతో ఒప్పందం రద్దు చేసుకోవాలని అభిమానులు బీసీసీఐని కోరారు. అప్పుడు ఈ విషయం పై సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ అధికారులు తెలిపారు. అయితే ఈ విషయ పై నిన్న జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశం లో చర్చించ్చారు. ఐపీఎల్ నిర్వహించాల్సిన తేదీల ఖరారుతో పాటుగా ఈ లీగ్ స్ఫాన్సర్స్ విషయం లో ఎలాంటి మార్పులు ఉండవు అని తెలిపారు అధికారులు. అంటే ఈ ఏడాదితో పాటుగా వచ్చే రెండు ఐపీఎల్ లకు కూడా వివో నే స్ఫాన్సర్స్. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 జరగనుండగా.. మొత్తం 53 రోజల్లో 60 మ్యాచ్‌లు జరగనున్నాయి.