ఆమంచి, అవంతిని ఆడవాళ్లు చీపుళ్లతో కొడతారు..!

ఆమంచి, అవంతిని ఆడవాళ్లు చీపుళ్లతో కొడతారు..!

టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎంపీ అవంతి శ్రీనివాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప... అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్‌ను ఆడవాళ్లు చీపుళ్లతో కొడతారని వ్యాఖ్యానించారు. ఆమంచి, అవంతి పార్టీలు మారి కాపు ద్రోహులుగా నిలుస్తున్నారని మండిపడ్డ చినరాజప్ప... కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన జగన్ పార్టీలోకి ఎలా వెళ్లారు..? అని ప్రశ్నించారు. వైసీపీనే అధికారంలోకి రాదు.. ఇక మంత్రి పదవులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటూ ఎద్దేవా చేశారు హోంశాఖ మంత్రి. మరోవైపు దమ్ము ధైర్యం ఉన్నోళ్లు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తార్న ఆయన.. గెలుస్తామనే ధైర్యం ఉంది కాబట్టే రాజీనామాలు చేశారు.. ఇప్పటికే ఇద్దరు రాజీనామాలు చేశారు. మిగతావాళ్లు రాజీనామాలు చేస్తారో చేయరో వాళ్ల వ్యక్తిగతం అన్నారు. ఎమ్మెల్సీలుగా కొనసాగుతోన్న వాళ్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే ముందు రాజీనామాలు చేసే అంశంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు చినరాజప్ప.