సామ్రాజ్యవాద విస్తరణలో పోటీపడుతున్న అమెరికా-చైనా....బలవుతున్న ఎమర్జింగ్ దేశాలు.

సామ్రాజ్యవాద విస్తరణలో పోటీపడుతున్న అమెరికా-చైనా....బలవుతున్న ఎమర్జింగ్ దేశాలు.

గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ వార్తల్లో అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌ వార్‌ ఒక ప్రధాన అంశంగా వార్తల్లో నిలుస్తుంది...ఈ వార్తలను ప్రధానంగా సృష్టిస్తున్నది అమెరికా, ఐరోపాలకు చెందిన బహుళజాతి కార్పొరేట్ మీడియా కంపెనీలు... కాగా ఇండియాతో సహా ఇతర మూడో ప్రపంచ దేశాలలోని చిన్నా, పెద్దా వార్తా సంస్థలన్నీ ఈ వార్తా కధనాలను క్రమం తప్పకుండా వాటిని అనుసరిస్తున్నాయి... వాస్తవాల జోలికి పోకుండా అవాస్తవాలనే వాస్తవాలుగా నెత్తి మీద వేసుకుని ప్రచారం చేస్తున్నాయి...భారత దేశంలో అయితే కొన్ని ప్రాంతీయ భాష మీడియా సైతం పశ్చిమ కార్పొరేట్ పత్రికలు చెప్పే అబద్ధాలను, అర్ధ సత్యాలను గొప్ప వార్తా కధనాలుగా ప్రజల ముందు ఉంచుతున్నాయి..చైనా,అమెరికా దేశాలు పరస్పరం చేస్తుకుంటున్న ఆరోపణలల్లో ఎంత నిజం ఉందనే విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నాయి..
ఇప్పటి వరకూ చైనా-అమెరికా సామ్రాజ్యవాద దేశాల మధ్య సమస్యగా చెబుతున్న కరోనా  కాకుండా మరో కోణం కూడా ఉంది...అది ఎంటనేది విపులంగా విశ్లేషించకుండా మొత్తం సమస్య కరోనా మాత్రమే అని ఇరు దేశాలు ప్రపంచ దేశాలను మోసం చేస్తున్నాయి..గట్టిగా చెప్పాలంటే అమెరికా-చైనా మధ్య ఉన్నది, సామ్రాజ్యవాద ఆధిపత్య యుద్ధ కోణం మాత్రమే... డొనాల్డ్ ట్రంప్ అధికారం లోకి వచ్చీ రాగానే చైనాపై ఆరోపణలతో విరుచుకుపడుతూ వచ్చాడు... చైనాను తన కరెన్సీ విలువను కృత్రిమంగా తక్కువ స్ధాయిలో ఉంచడం ద్వారా ఎగుమతులు పెంపొందించుకుని అమెరికాతో వాణిజ్య మిగులు సంపాదిస్తోందని అధికారికంగా ప్రకటించాడు...
చైనా కూడా త్రీవంగా అదే స్థాయిలో స్పందించింది...అమెరికా అలా ప్రకటిస్తే చైనాపై ప్రతీకార వాణిజ్య చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది... అది మళ్ళీ చైనాలో పరిశ్రమలు, కంపెనీలు, శాఖలు నిర్వహించి లబ్ది పొందుతున్న అమెరికా కంపెనీలు నష్టపోయెందుకు దారి తీస్తుంది...చైనాలోని అమెరికా కంపెనీల ఒత్తిడితో ట్రంప్ గతంలో తాత్కాలికంగా వెనక్కి తగ్గాడు...దక్షిణ చైనా సముద్ర సంపాదల్లో (చమురు, మత్స్య, ఖనిజ సంపదలు) ఫిలిప్పైన్స్, వియత్నాం, బ్రూనో తదితర దేశాలను రెచ్చగొట్టి చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు...దౌత్య, ఆర్ధిక, మిలట్రీ రంగాలు అన్నింటిలో చైనాకు సమస్యలు సృష్టించడం అమెరికా ఒక విధానంగా అమలు చేస్తోంది.. అది ఇప్పుడు ట్రంప్ ఏలుబడిలో ఇది తీవ్రం అయింది...
మూడు దశాబ్దాలుగా వాణిజ్య మిగులు ద్వారా చైనా వద్ద భారీ మొత్తంలో పెట్టుబడి పొగుబడింది...ఈ పెట్టుబడి, లాభాలు సంపాదించే పెట్టుబడిగా రియలైజ్ కావాలంటే చైనాకు మార్కెట్లు కావాలి. ఖనిజ వనరులు కావాలి. చమురు, గ్యాస్ లాంటి శక్తి వనరులు కావాలి. ఈ వనరులతో తయారు చేసే సరుకుల అమ్మకానికి మార్కెట్ మరింతగా విస్తరించాలి... పైకి ఎగబాకే దశలో ఉన్న చైనా బలమైన ప్రత్యర్ధులతో సర్దుబాట్ల ద్వారా, బలహీన ప్రత్యర్ధులకు పెట్టుబడి ఆశలు కల్పించడం ద్వారా మార్కెట్ విస్తరణకు ప్రయత్నిస్తోంది...ఇప్పటికే మార్కెట్లను వశంలో ఉంచుకున్న పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు సవాలు విసురుతుంది...కరోనాతో కలవికళం అవుతున్న, అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా ఆర్ధికంగా చైనాతో పోటీ పడలేని స్ధితిలో ఉన్నది...దానితో భారీగా మిలట్రీ శక్తిని మోహరించి చైనాను దారికి తెచ్చుకోవటానికీ,చైనాతో సరిహద్దు కలిగిన దేశాలను తమవైపు  మార్చుకోవటానికి ట్రంప్‌ ఒత్తిడి చేస్తున్నారు..
అమెరికాలో రాజకీయ, సామాజిక పరిస్ధితులు నిలకడగా లేవు. ఆర్ధిక అస్ధిరత, సంక్షోభంలు అనివార్యంగా రాజకీయ, సామాజిక సంక్షోభాలకు దారి తీస్తున్నది...ఈ నేపధ్యంలో ఇంట గెలవడానికి ముందు రచ్చ గెలవాలని ట్రంప్ భావిస్తున్నాడు. అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసే గట్టి చర్యకు పాల్పడి అమెరికాలో తన పాలనకు ఎదురు లేకుండా చేసుకోవాలని తలపోస్తున్నాడు... అమెరికా పాలకవర్గాల్లో తలెత్తిన ఈ తీవ్ర వైరుధ్యాలకు కారణం అమెరికా సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధలో నెలకొన్న లోతైన సంక్షోభం..కరోనా మహమ్మారితో కునారిల్లుతున్న కార్మికవర్గ కొనుగోలు శక్తి. మరోవైపు రాశుల కొద్దీ పోగుబడుతున్న ఉత్పత్తులకు కొనుగోలుదారులు లేని పరిస్ధితి...
అమెరికాలో వాల్‌స్ట్రీట్ కంపెనీలు ఇప్పుడు ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నాయి..కరోనా సంక్షోభంలో ముగిపోయిన ద్రవ్యసంస్థలు తమ పెట్టుబడిని విస్తరించుకునేందుకు పెద్దతో కలిసి ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెస్తున్నాయి..దక్షిణ చైనా సముద్రం, చైనా-ఇండియా సరిహద్దు, చైనా – పాకిస్తాన్ సరిహద్దు, కాశ్మీర్ సమస్య, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సి‌పి‌ఈ‌సి), హిందూ మహా సముద్రం, బలూచిస్తాన్, అరేబియా సముద్రం ఉత్తర తీరం….ఇలా పలు చోట్ల అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది... చైనా సహితం తన వాణిజ్యాన్ని కాపాడుకునే క్రమంలో దూకుడుగానే వ్యవహరిస్తున్నది... రోజు రోజుకీ ప్రభావం కోల్పోతున్న అమెరికా రెట్టింపు దూకుడు, ఆధిపత్యాలను అమలు చేస్తూ ఇండియా లాంటి దేశాలపై ఒత్తిడి తెచ్చి చైనాతో ఘర్షణ పడేలా రెచ్చగొడుతోంది... ఇది అంతిమంగా ఇండియా లాంటి దేశాల ప్రజల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నది...
మరోవైపు చైనాకూడా తన దూకుడును తగ్గించుకోవటం లేదు...అమెరికా తన మిత్రదేశాలతో చైనాపై వాణిజ్య ఒత్తిడి తెస్తుంటే అదే స్థాయిలో చైనాకూడా తన అనుకూల దేశాలతో సంబంధాలు పెంచుకుంటుంది...చైనా వ్యతిరేక దేశాలపై ద్వైపాక్షిక ఒప్పందాలతో ఒత్తిడి తెస్తుంది...ఇప్పటికే ఆస్ట్రేలియా,జపాన్‌తో అనేక ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన బెడుతుంది...భారత్‌కు అమెరికా-చైనా రెండు దేశాలు వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైని..అందుకే రెండు అగ్రదేశాలు భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తుంది..
భారత ప్రజలు అమెరికా అహంకార, ఆధిపత్య ధోరణిని ప్రధానంగా టార్గెట్ చేయాలి...అలాగే చైనా విస్తరణవాద ధోరణిని తిరస్కరించాలి...అమెరికా, చైనా మధ్య వాణిజ్య యద్దంలో భారత్‌ను రెండు దేశాలు ఆయుధంగా మార్చుకుంటున్నాయి...మన పాలకులు ఇప్పుడు అగ్రదేశాల మధ్య జరుతున్న కోల్డ్‌వార్‌ను అనుకూలంగా మార్చుకుని సరిహద్దు సమస్యలు పరిష్కిరించుకోవాలి....అలా కాకుండా భారత పాలకులు ఎలా రెచ్చగొడితే వారి వైపు ఆలోచన లేకుండా కొట్టుకుపోయినట్లయితే అది అంతిమంగా భారత పాలకవర్గాలకు, అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలకు మాత్రమే లాభం కలుగుతుంది...ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది...