బలపడుతున్న చైనా... ఉత్తర కొరియా బంధం...ఏ పరిణామాలకు దారితీస్తుంది...!!
ఒక శత్రువు మరో శత్రువుకు మిత్రుడు అవుతాడు. ఆ ఇద్దరు కలిస్తే పరిణామాలు వారి నుంచి ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ సంగతి అందరికి తెలుసు. అందుకే ప్రపంచ దేశాల మధ్య శత్రుత్వం కంటే మిత్రుత్వం పెంచుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. శత్రుత్వం పెరిగిన సమయంలో మనం రెండు ప్రపంచ యుద్ధాలను చూశాం. రెండు ప్రపంచ యుద్ధాల వలన ప్రపంచం ఎంతగా నష్టపోయిందో అందరికి తెలుసు.
ఇంతకాలం తరువాత ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో కరోనా వైరస్ అడ్డుకట్ట వేసింది. మనిషి గమనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. కరోనా వైరస్ చైనాలో పుట్టిందని, చైనా కావాలనే కరోనా వైరస్ ను ల్యాబ్ లో అభివృద్ధి చేసి ప్రపంచం మీదకు వదిలిందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను చైనా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు, చైనాలో ఉన్న విదేశీ కంపెనీలు అక్కడి నుంచి తరలి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే జరిగితే ఇది కోలుకోలేని దెబ్బ అవుతుంది.
ఇదిలా ఉంటె, ఇప్పటికే ప్రపంచం నుంచి అనేక ఆరోపణలు, ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా, చైనాకు మధ్య మంచి మిత్రుత్వం ఉన్నది. ఈ సమయంలో ఇది మరింతగా బలపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉత్తర కొరియాలో చైనా అనేక పెట్టుబడులు పెట్టింది. ఆ దేశానికీ సాంకేతికంగా కూడా సహాయ సహకారాలు అందిస్తోంది. ఇటీవలే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చైనాను పొగడ్తలతో ముంచేత్తాడు. కరోనా కట్టడికి చైనా అనుసరించిన విధానం భేష్ అన్నాడు. చైనా తీసుకున్న ప్రతి నిర్ణయం చైనా అభివృద్ధికి దోహదం చేస్తుందని కిమ్ చెప్పడంతో, కిమ్ చేసిన వ్యాఖ్యలపై జిన్ పింగ్ స్పందించాడు.
కష్టకాలంలో అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు. చైనా, ఉత్తర కొరియా సంబంధాలు మరింతగా పెరుగుతాయని, మైత్రి మరింతగా బలపడాలని జిన్ పింగ్ కోరాడు. ఈ రెండు దేశాల మధ్య మైత్రి బలపడితే... దాని వలన ప్రపంచానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. చైనా సాంకేతికతకు ఉత్తర కొరియా దూకుడు తోడైతే... అది అగ్రరాజ్యానికి ఇబ్బంది అవుతుంది. ఒక్క అమెరికాకే కాదు, దక్షిణ కొరియా, జపాన్ కు కూడా ఇబ్బందే అవుతుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)