చైనాలో లక్షలాది మందిపై టీకా ప్రయోగం... 

చైనాలో లక్షలాది మందిపై టీకా ప్రయోగం... 

చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది.  కోట్లాది మంది ప్రజలు కరోనాబారిన పడ్డారు.  లక్షలాది మంది మరణించారు.  ప్రతిరోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి.  కరోనాకు చెక్ పెట్టేందుకు చాలా దేశాలు కరోనా వాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి.  అయితే, ఇప్పటి వరకు పూర్తి వాక్సిన్ బయటకు రాలేదు.  కరోనా వైరస్ కు పుట్టినిల్లయిన చైనాలో నాలుగు వాక్సిన్ ను ట్రయల్స్ దశలో ఉన్నాయి.  ట్రయల్స్ దశలో ఉండగానే అత్యవసర వినియోగం పేరుతో లక్షలాది మందికి ఇస్తున్నారు. జూన్ లోనే చైనా ప్రభుత్వం అత్యవసర వినియోగం కింద వాక్సిన్ లకు అనుమతి ఇచ్చింది.  అయితే, ట్రయల్స్ దశలో ఉన్న టీకాను విచ్చలవిడిగా ప్రజలకు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  టీకా వలన దుష్ప్రభావాలు కలుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా అత్యవసర వినియోగం పేరుతో టీకాలు వేస్తున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు.  చైనాకు  చెందిన ప్రఖ్యాత రచయిత కాన్ చాయ్ ఇటీవలే టీకా వేయించుకున్నాడు.  మొదటి డోస్ వేసుకున్నప్పుడు ఎలాంటి దృష్ప్రభావం కలగలేదని, కానీ రెండోసారి టీకా వేయించుకున్నాక శరీరంలో మార్పులు వచ్చినట్టు తెలిపారు.  కళ్ళు తిరిగినట్టుగా, ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు అనిపించిందని అన్నారు.  ఇలాంటి ప్రభావం చాలా మందిలో కలిగినట్టు అయన తెలిపారు.  వాక్సిన్ వలన ఇబ్బందులు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు.