కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం..!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరించి కంటిమీద కునుకులేకుండా చేసింది.. ఎందరో జీవితాలను చిదిమేసింది.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది.. చాలా దేశాలకు ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితికి వెళ్లిపోయాయి.. కానీ, కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం కురిసింది. కరోనా మహమ్మారి కారణంగా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థ చితికిపోతే, కరోనా పుట్టినిల్లైన చైనాలో మాత్రం కాసుల పంటపండింది. చైనా ఎగుమతులలో వృద్ధి రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా అత్యధిక స్థాయికి చేరుకుంది. అదే సమయంలో దిగుమతులు కూడా పెరిగినట్లు ఆ దేశం కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. కరోనా కాలంలో మాస్క్‌ల వంటి వ్యక్తిగత రక్షణ సామగ్రి, ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఎలక్ట్రానిక్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో చైనా ఎగుమతులు భారీగా పెరిగాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)