ట్రంప్‌కు చైనా కౌంటర్

ట్రంప్‌కు చైనా కౌంటర్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణపై అమెరికా చేస్తోన్న విమర్శలను చైనా మరోసారి తిప్పికొట్టింది. అయిందేదో అయిందనీ... అగ్రదేశం ఆ పేరుకు తగ్గట్టు ప్రవర్తించాలనీ.. ఐక్యరాజ్య సమితి  ఉన్నతస్థాయి సమావేశంలో చైనా రాయబారి జాంగ్ జున్ అన్నారు. ఇటీవల యూఎన్ 75వ వార్షిక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ..కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనా చర్యలే కారణమంటూ విరుచుకుడ్డారు. దీనిపై స్పందించిన చైనా.. ట్రంప్‌ ఆరోపణలను తిప్పికొట్టింది. ప్రపంచంలోనే అత్యాధునిక వైద్య సాంకేతికత అందుబాటులో ఉన్న అమెరికాలో.. ఎందుకు ఇన్ని కరోనా కేసులు, మరణాలు ఉన్నాయని, ఈ పరిస్థితికి జవాబుదారీగా ఉండాల్సింది యూఎస్‌లోని కొందరు రాజకీయనాయకులేనంటూ పరోక్షంగా ట్రంప్‌ను విమర్శించింది.