పంది మాంసం దిగుమతిని ఆపేసిన చైనా..కారణం ఇదే.!

 పంది మాంసం దిగుమతిని ఆపేసిన చైనా..కారణం ఇదే.!

మొన్నటివరకు నడిచేవి, పాకేవి, ఎగిరేవి అంటూ లేకుండా తిన్న చైనీయులు కరోనా విజృంభణతో మాంసం తినడానికి కొద్దిగా ఆలోచిస్తున్నారు. తాజాగా జర్మనీ దేశం నుండి పంది మాంసం ఎగుమతిని ఆపేసింది. ఆ పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. పంపిన మాంసాన్ని కూడా వెనక్కి పంపిస్తామని చైనీస్ కస్టమ్స్ ఆఫీస్ అండ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ పేర్కొంది. చైనా నిర్ణయం పై జర్మనీ ఆహార, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందించారు. చైనా అధికారులతో తాము చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాధి నమోదైన ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన ప్రాంతాల నుంచి పంది మాంసాన్ని దిగుమతి చేసుకునేలా జర్మనీతో చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. జర్మనీ పందిమాంసాన్ని చైనా వద్దనటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.