మైనర్ బాలికను శారీరకంగా హింసించిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు...

మైనర్ బాలికను శారీరకంగా హింసించిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు...

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. చొప్పదండిలో మైనర్ బాలికను శారీరకంగా హింసించిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు చేసారు. తన తండ్రికి సపర్యలు, ఇంటి పని చేసేందుకు రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి మైనర్ బాలికను చొప్పదండి తీసుకువచ్చాడు రాజశేఖర్ రెడ్డి. అయితే ఇంటి పనులు సరిగా చేయడం లేదంటూ బాలికకు చిత్రహింసలు పెట్టాడు. విషయం తెలుసుకుని పోలీసులు ఆపరేషన్ స్మైల్లో భాగంగా బాలికను కాపాడారు. పని చేయకపోతే కొడుతుండే వారంటూ అధికారుల ఎదుట కంటతడి పెట్టుకుంది బాలిక. మెట్ల కిందే నిద్ర పోయేదాన్ని అంటూ గోడును వెళ్ల బోసుకుంది బాధితురాలు. అయితే ఆ బాలికను icds కేంద్రానికి తరలించిన అధికారులు... రాజశేఖర్ రెడ్డి పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ, బాల కార్మిక హక్కుల చట్టం కింద కేసు నమోదు చేసారు.