రివ్యూ: ఛపాక్ 

రివ్యూ: ఛపాక్ 

నటీనటులు: దీపిక పదుకొణె, విక్రాంత్‌ మస్సీ, మధురజీత్‌ సర్గి, అంకిత్‌ బిషత్‌ తదితరులు
సంగీతం: శంకర్‌-ఎహెషాన్‌-లాయ్‌
సినిమాటోగ్రఫీ: మాలే ప్రకాష్‌
నిర్మాత: దీపిక పదుకొణె, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, గోవింద సింగ్‌ సంధు, మేఘనా గుల్జర్‌
దర్శకత్వం: మేఘనా గుల్జర్‌ 

ప్రస్తుతం దేశంలో బయోపిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్నది.  ఈ విషయం అందరికి తెలిసిందే.  ఇలాంటి సినిమాలకు కథ గురించి వెతుక్కునే అవసరం ఉండదు.  అయితే, దాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరించే విధంగా తీయడంలోనే దర్శకుడి గొప్పదనం కనిపిస్తుంది.  ఇక ఇదిలా ఉంటె, బాజీరావు మస్తానీ, పద్మావతి సినిమాలతో మెప్పించిన దీపికా పదుకొనె, యాసిడ్ బాధితురాలి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛపాక్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.  ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది.  ఆ సినిమా ఎలా ఉన్నదో చూద్దామా. 

కథ: 

దీపికా పదుకొనెకు అందరి అమ్మాయిల్లానే ఎన్నో కలలు కంటుంది.  తన కలల్ని కాలంలో నిజం చేసుకోవాలని అనుకుంటుంది.  జీవితంలో గొప్ప గాయనిగా ఎదగాలని అనుకుంటుంది. ఇలాంటి కలలు కంటూ జీవితాన్ని గడుపుతున్న దీపికపై యాసిడ్ దాడి జరుగుతుంది.  అందంగా ఉన్న జీవితంలో ఒక్కసారిగా విషాదంగా మారిపోతుంది.  భవిష్యత్ పై చీకటి అలుముకుంటుంది.  ఇలా నిరాశతో సాగుతున్న ఆమె జీవితంలోకి విక్రాంత్ విలేకరి వస్తాడు.  ఆమె జీవితానికి భరోసా ఇవ్వడమే కాకుండా, ఆమె జీవితంలో జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలనీ ఆమెను ప్రోత్సహిస్తాడు.  కోర్టులో కేసును దాఖలు చేస్తారు... యాసిడ్ దాడి చేసింది ఎవరు? ఎందుకు చేశారు? దీపికకు న్యాయం జరిగిందా లేదా అన్నది మిగతా కథ. 

విశ్లేషణ: 

యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా నిర్మించిన సినిమా కావడంతో ఆమె జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను ఈ సినిమాలో చూపించారు.  మహిళల్లో స్ఫూర్తిని నింపేందుకు ఈ సినిమాను తెరకెక్కించారు.  ఢిల్లీలో 2012 లో జరిగిన రేప్ సంఘటనపై ఢిల్లీలో యువత ఆందోళన చేస్తుంటారు.  అక్కడి నుంచి యాసిడ్ దాడి వైపు సినిమా మళ్లుతుంది.  అందమైన అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగిన తరువాత ఆమె జీవితం ఎలా మారింది అనే విషయాలను హృదయాలకు హత్తుకునే విధంగా చూపించారు.  ఫస్ట్ హాఫ్ మొత్తం యాసిడ్ దాడుల చుట్టూ తిరుగుతుంది.  ఇక సెకండ్ హాఫ్ లో దీపిక ఈ దాడులపై ఎలా పోరాటం చేసింది అనే విషయాలను చూపించారు.  యాసిడ్ దాడిలో గాయపడిన వ్యక్తులు ఎంత నరకాన్ని అనుభవిస్తారో సినిమాలో చూపించారు.  సమాజంలో వాళ్లకు ఎదురయ్యే పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.  సెకండ్ హాఫ్ లో మొత్తం ఈ సీన్లతోనే నింపేశారు.  దీంతో సినిమా నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది.  

నటీనటుల పనితీరు: 

ఈ సినిమా మొత్తాన్ని దీపిక తన భుజస్కందాలపై వేసుకొని నడిపించింది.  యాసిడ్ దాడి నుంచి కోలుకున్నాక తన మొహాన్ని అద్దంలో చూసుకొని బాధపడిన సన్నివేశం నిజంగా బాధవేస్తుంది.  ఇలాంటి దృశ్యాల్లో దీపికా అద్భుతంగా నటించింది.  మిగతా నటీనటులు తమ పరిధిమేరకు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

బయోపిక్ సినిమా అయినప్పటికీ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను చొప్పించారు.  అలానే శంకర్ ఎహ్ లాయ్ సంగీతం ఆకట్టుకుంటుంది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

దీపిక, ఎమోషనల్, సందేశం 

నెగెటివ్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్ సాగతీత 

చివరిగా : ఛపాక్ : యాసిడ్ దాడిపై ఓ చక్కటి సందేశం