కరోనా పై పోరుకు విరాళం అందించి ఎంతో వెల్లడించని పుజారా...

కరోనా పై పోరుకు విరాళం అందించి ఎంతో వెల్లడించని పుజారా...

చైనా నుండి వచ్చిన కరోనా కారణంగా ప్రపంచం అతలాకుతలం అవుతుంది. అయితే ఈ వైరస్ ప్రభవం మన దేశం పైన కూడా బాగానే ఉంది. ఈ వైరస్ కారణంగా అని క్రీడలు నిలిచిపోయాయి. అయితే ఈ వైరస్ ను ఎదురించడానికి భారత టెస్ట్ బాట్స్మెన్ చేతేశ్వర్ పుజారా కూడా పిఎం కేర్ ఫండ్‌కు విరాళం ఇచ్చారు. అలాగే కరోనా కు వ్యతిరేకంగా ఈ పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది మరియు పోలీసులకు పుజారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయానికి సంబంధించిన ఓ పోస్ట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు పుజారా. అందులో... "నా కుటుంబం మరియు నేను మా తరపున పిఎం కేర్ ఫండ్ మరియు గుజరాత్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం కొంచెం సహకరించాము మరియు మీరు కూడా అలా చేస్తారని ఆశిస్తున్నాము. ప్రతి సహకారం ముఖ్యమైనది, కాబట్టి మన తరపున అందరూ కొంచెం సహకరిద్దాం మరియు కలిసి మనం పోరాడితే ఖచ్చితంగా దాన్ని అధిగమిస్తాము" అని తెలిపాడు. అయితే పుజారా ఎంత సహాయం చేస్తున్నాడు ఏ విధంగా చేస్తున్నాడు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.