ఉత్కంఠ పోరులో చెన్నై ఘన విజయం...!

ఉత్కంఠ పోరులో చెన్నై ఘన విజయం...!
టీ-20లో ఉన్న అసలైన మజా ఐపీఎల్-2018 తొలి మ్యాచ్ తోనే అనుభవానికి వచ్చింది. రెండు సంవత్సరాల పాటు నిషేధాన్ని ఎదుర్కొని, తిరిగొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఓపెనర్ల నుంచి ధోనీ సహా మిడిలార్డర్ వరకూ అంతా విఫలమైనా... డ్వేన్ బ్రావో అద్భుతమైన ఆటన ప్రదర్శించి మెరుపులా ఇన్నింగ్స్ ను విజయంపథం వైపు నడిపించారు. వాంఖడే స్టేడియంలో అసంఖ్యాకమైన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ గొంతులు మూగబోయిన సమయంలో చెన్నై విజయం సాధించింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 15, లూయిస్ 0, ఇషాన్ కిషన్ 40, సూర్యకుమార్ 43, హార్దిక్ పాండ్యా 22, కృనాల్ పాండ్య 41 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టులో వాట్సన్ 16, అంబటి రాయుడు 22, రైనా 4, కేదార్ జాదవ్ 24, ధోనీ 5, జడేజా 12, చాహర్ 0, హర్భజన్ 8, వుడ్ 1 పరుగులు చేయగా, బ్రావో 68 పరుగులు చేశాడు. ముంబై జట్టులోని మయాంక్ మార్కండే అద్భుత రీతిలో బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈరోజు మొహాలీ వేదికగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య సాయంత్రం 4 గంటల నుంచి, కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. అలాగే.. కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రాత్రి 8 గంటల నుంచి పోటీ ప్రారంభం కానుంది.