ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై...

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ గెలిచి మళ్ళీ ఎలాగైనా పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి రావాలని చూస్తున్న ఢిల్లీ మొదట బౌలింగ్ చేయనుంది. అలాగే గాయం కారణంగా గత మ్యాచ్ మధ్యనుండి వెళ్లిన ఢిల్లీ కెప్టెన్ అయ్యర్ ఈ మ్యాచ్ లో ఆడటం ఆ జట్టుకు బలమే. ఇక వరుస పరాజయాలతో ఉన్న చెన్నై గత మ్యాచ్ సన్ రైజర్స్ పై విజయం సాధించి మళ్ళీ గెలుపు బాటలోకి వచ్చింది. మరి ఈ మ్యాచ్ లోను గెలిచి దానిని కొనసాగిస్తుందా... లేదా అనేది చూడాలి. 

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్ (c), మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ (w), ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే

చెన్నై: ఫాఫ్ డుప్లెసిస్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (w/c), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, కర్న్ శర్మ