ఐపీఎల్ 2021 : మొదటి స్థానానికి చేరుకున్న చెన్నై...   

ఐపీఎల్ 2021 : మొదటి స్థానానికి చేరుకున్న చెన్నై...   

ముంబై  వేదికగా ఐపీఎల్ 2021 లో ఈరోజు జరిగిన రెండో మ్యాచ్ లో కోల్‌కత నైట్ రైడర్స్ పైన చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు చెన్నై పేసర్ దీపక్ చాహర్ గట్టి షాక్ ఇచ్చాడు. చాహర్ దెబ్బకు కోల్‌కత టాప్ ఆర్డర్ మొత్తం విలవిలలాడిపోయింది. 31 పరుగులకే మొదటి 5 వికెట్లు కోల్పోయిన కోల్‌కత ఓటమి తప్పనిసరి అనుకున్న సమయంలో ఆ జట్టు స్టార్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ అర్ధశతకంతో కోల్‌కత మళ్ళీ పోటీలోకి వచ్చింది. అతనికి తోడుగా దినేష్ కార్తీక్ (40) రాణించడంతో ఆ జట్టు విజయం వైపుకు అడుగులు వేసింది. కానీ మళ్ళీ కొన్ని పరుగుల తేడాతో వీరిద్దరూ పెవిలియన్ చేరుకోవడంతో ఇక కోల్‌కతకు ఓటమి తప్పదు అనుకున్నారు. కానీ అప్పుడే ఆ జట్టు స్టార్ పేసర్ పాట్ కమ్మిన్స్ సామ్ కర్రన్ వేసిన 16 ఓవర్లో 30 పరుగులు బాదడంతో మ్యాచ్ ఆసక్తిని రేకేతించింది. కానీ ఆ జట్టు విజయానికి చివరి ఓవర్లో 20 పరుగులు కావాల్సి ఉండగా చేతిలో ఉన్న ఒక్క వికెట్ రన్ ఔట్ రూపంలో కేకేఆర్ 19.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది. దాంతో చెన్నై 18 పరుగుల తేడాతో ఈ ఐపీఎల్ లో మూడో విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. 

అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (64) అర్ధశతకంతో రాణించగా మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ 95 పరుగులు చేసి చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచి మెరుపులు మెరిపించడంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.