ఐపీఎల్ 2020 : కోహ్లీ హాఫ్ సెంచరీ... చెన్నై లక్ష్యం..? 

ఐపీఎల్ 2020 : కోహ్లీ హాఫ్ సెంచరీ... చెన్నై లక్ష్యం..? 

ఈ రోజు ఐపీఎల్ 2020 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మొదట బౌలింగ్ చేసిన చెన్నై బెంగళూరు ను బాగానే కట్టడి చేసింది. ఓపెనర్లు ఇద్దరు 46 పరుగులకే పెవిలియన్ కు చేరుకున్న కెప్టెన్ కోహ్లీ (50) హాఫ్ సెంచరీ తో రాణించగా డివిలియర్స్ (39)  అతనికి తోడుగా నిలిచాడు. కానీ వీరి తర్వాత వచ్చిన వారు ఎవరు 5 పరుగుల కంటే ఎక్కువ చేయకపోవడంతో బెంగళూరు నిర్ణిత ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఇక చెన్నై బౌలర్లలో సామ్ కర్రన్ 3 వికెట్లు సాధించగా దీపక్ చాహర్ రెండు, మిచెల్ సాంట్నర్ ఒక వికెట్ తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై విజయం సాధించాలంటే 146 పరుగులు చేయాలి. కానీ ఇప్పటివరకు ఈ ఏడాది ఐపీఎల్ లో ఆ జట్టు చేసిన ప్రదర్శన చూస్తుంటే గెలవడం కష్టమే అని చెప్పాలి. మరి ఈ మ్యాచ్ లో ఎవరి విజయం సాధిస్తారు అనేది చూడాలి.