పచ్చబొట్టు వేయించుకున్న రైనా... ఎవరి పేరంటే..?

పచ్చబొట్టు వేయించుకున్న రైనా... ఎవరి పేరంటే..?

మన దేశంలో సినిమా సెలబ్రెటీలు , క్రీడాకారులకు బాగా ఫాలోయింగ్ ఉంటుంది. అయితే సినిమా సెలబ్రెటీలు ఎక్కువగా ఎటువంటి పచ్చబొట్టు వేయించుకోరు, కానీ క్రీడాకారులు మాత్రం తమ శరీరం పైన రకరకాలైన టాటూ లు వేయించుకుంటారు. భారత ఆటగాడు సురేష్ రైనా కుడి చేతిపైన కూడా తన కూతురు గ్రేసియా పేరు ఉంటుంది. ఇక తాజాగా రైనా ఎడమ చేతిపైన తన కొడుకు రియో, భార్య ప్రియాంక పేర్లను పచ్చబొట్టు వేయించుకున్నాడు. దానికి సంభందించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ..''నేను జీవించడానికి వారే కారణం'' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగనుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ ముఖ్య ఆటగాడైన రైనా తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. దానికి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. సెప్టెంబర్ 19 న ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ఆటగాళ్లు ఆగస్టు 21 న యూఏఈ కి బయలుదేరనున్నారు.