2021 లో కూడా ధోనీనే మా కెప్టెన్...

2021 లో కూడా ధోనీనే మా కెప్టెన్...

ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అత్యంత విజయవంతమైన జట్టు. ఆడిన 10 సీజన్ లలో ప్లే ఆఫ్ కి చేరిన చెన్నై జట్టు ఈ సీజన్ లో మాత్రం అంతగా రాణించలేకపోయింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ లలో కేవలం 4 మాత్రమే గెలిచి ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్ నుండి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అయితే చెన్నై జట్టు వైఫల్యాలకు ఆ జట్టు కెప్టెన్ ధోనినే కారణమని... కొని మ్యాచ్ లలో అతను తీసుకున్న నిర్ణయాల కారణాంగే ఆ జట్టు ఓడిపోయింది అని మాజీలు విమర్శించారు. ఫామ్ లో లేని కొంత మంది ఆటగాళ్లకు చాలా మ్యాచ్ లలో ధోని అవకాశాలు ఇచ్చాడని.. అందువల్లే వారు ఓడిపోయారని అన్నారు. దాంతో ఆ జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లను వచ్చే ఏడాది జట్టు నుండి తీసేస్తారని... ధోనిని కూడా కెప్టెన్ గా తప్పిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పై స్పందించిన సిఎస్కే సీఈఓ విశ్వనాథన్... ఒక్క ఏడాది విఫలమైనంత మాత్రాన ధోనిని  మేము వదిలేస్తామా... 2021 లో కూడా ధోనీనే మా కెప్టెన్. అతను చెన్నై జట్టుకు మూడు టైటిల్స్ అందించాడు. అంతేకాకుండా ఐపీఎల్ లో ఏ జట్టు కూడా ఇప్పటివరకు ప్రతి సీజన్ లో ప్లే ఆఫ్ లోకి వచ్చింది లేదు . కానీ ఈ సీజన్ లో మాత్రం చెన్నై జట్టు ప్లే ఆఫ్ కి రాలేదు. జట్టు నుండి రైనా, హర్భజన్ తప్పుకోవడం తర్వాత ఆటగాళ్లకు కరోనా సోకడం జట్టులో సమతుల్యాన్ని దెబ్బ తీశాయి అన్నాడు.