కుప్ప‌కూలిన ధోనీ గ్యాంగ్..

కుప్ప‌కూలిన ధోనీ గ్యాంగ్..

ఐపీఎల్ 2020 సీజ‌న్ ఎంఎస్ ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఏ మాత్రం క‌లిసిరావ‌డం లేదు.. వ‌రుస ప‌రాజ‌యాలు ఎదుర‌వుతోన్నా.. ఆ జ‌ట్టులో ఏమాత్రం మార్పు రావ‌డంలేదు.. ప‌రుగుల వ‌ర‌ద‌పారే ఐపీఎల్‌లో.. 20 ఓవ‌ర్లు ఆడి.. క‌నీసం 120 ప‌రుగులు కూడా చేయ‌లేక‌పోయింది... తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 114 ప‌రుగులు మాత్ర‌మే చేసిన చెన్నై... త‌న ప్ర‌త్య‌ర్థి ముంబై ముందు 115 ప‌రుగుల టార్గెట్‌ను పెట్టింది... ఇంకో విష‌యం ఏంటంటే.. ఆరుగురు చెన్నై బ్యాట్స్‌మ‌న్స్ క‌నీసం రెండంకెల స్కోర్ కూడా సాధించ‌లేక‌పోయారు.. క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌తో చెన్నై బ్యాట్స్‌మ‌న్స్‌కు చుక్క‌లు చూపించారు ముంబై బౌల‌ర్లు.. 

టాపార్డర్‌ ఘోరంగా విఫలం కాగా యువ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్ 47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల స‌హాయంతో 52 చేసి ఒక్కడే అర్ధశతకంతో రాణించాడు.. ముంబై బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతూ చెన్నైని స్వల్ప  స్కోరుకే కట్టడి చేశారు.  రుతురాజ్‌ గైక్వాడ్(0), డుప్లెసిస్‌(1), అంబటి రాయుడు(2), జగదీశన్‌(0), మహేంద్ర సింగ్‌ ధోనీ(16),  జడేజా(7), దీపక్‌ చాహర్‌(0)  అలా వచ్చి ఇలా పెవిలియ‌న్ చేరారు..