బ్రేకింగ్ : పలు మండలాల్లో ఎన్నికల తేదీలు మార్పు.. ఏయే మండలాలు అంటే ?
జిల్లా కలెక్టర్ల వినతి మేరకు పలు మండలాల్లో ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలు మార్పులు చేసింది. పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఆ జిల్లాల కలెక్టర్ల వినతి మేరకు మార్పులు చేసినట్టు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు డివిజన్ లో 20 మండలాలకు గాను 15కు మాత్రమే తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. ఒంగోలు డివిజన్లో మిగిలిన ఐదు మండలాలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఒంగోలు డివిజన్లో జె. పంగులూరు, కోరిసపాడు, ఎస్ మాగులూరు, అద్దంకి, బల్లికురవ మండలాల్లో వచ్చే నెల 9 బదులు 13న ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొవూరు డివిజన్లోని గోపాలపురం మండలానికి మూడో విడతకు బదులుగా రెండో విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. అలానే గోపాలపురం మండలంలో ఫిబ్రవరి 17వ తేదీకి బదులుగా 13న ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు డివిజనులోని నాలుగు మండలాలకు నాలుగో విడతకు బదులుగా మూడో విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. చింతలపూడి, కామవరపు కోట, లింగపాలెం, జె.నర్సాపురం మండలాల్లో పోలింగ్ తేదీ మార్పులు జరగనున్నాయి. ఈ నాలుగు మండలాల్లో ఫిబ్రవరి 21 బదులుగా 17న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)