ఇక నుండి తెలంగాణా మీద ప్రత్యేక శ్రద్ద

ఇక నుండి తెలంగాణా మీద ప్రత్యేక శ్రద్ద

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఇవాళ ఘనస్వాగతం లభించింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనపై పూల వర్షం కురిపిస్తూ, జై చంద్రబాబు నినాదాలతో ట్రస్ట్ భవన్ పరిసరాలను హోరెత్తించారు. దాదాపు 9 నెలల సుదీర్ఘ విరామం అనంతరం చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అడుగుపెట్టడమే వారి సంతోషానికి కారణం. కాగా, చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రావడమే కాదు, తెలంగాణ టీడీపీ నేతలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ చార్జిలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణుల్లో భరోసా నింపేందుకు చంద్రబాబు జోష్ గా మాట్లాడారు.. నాయకులు వెళ్ళిపోవటం టీడిపి కొత్త కాదని.. ఎవరు పోయినా.. కార్యకర్తలు మిగిలే ఉన్నారని అన్నారు..

పార్టీకి అన్ని స్థాయిల్లో సమర్దవంతమైన నాయకులను నియమించి ... తెలంగాణాలో పూర్వవైభవం తీసుకువస్తాం అంటున్నారు.. చంద్రబాబు సమావేశానికి వచ్చిన వాళ్ళకు మెదటి ప్రసంగంతోనే జోష్ నింపారు.. పార్టీ బలోపేతం కోసం ప్రతివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వస్తానంటున్న చంద్రబాబు పార్టీ బలోపేతం కోసం బ్యాక్ ఆఫీస్ కమిటీ వేసి మండలాల్లో, జిల్లాల్లో సమర్దవంతమైన నాయకులకు బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు చేయనున్నారు. అంతేకాదు హైదరాబాద్ అభివృద్దికి బీజం వేసానని చెప్తూనే.. టీడిపి పార్టీపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరి కలిసి రావాలి పిలుపునిచ్చారు.