.రౌడీలు కంటే హీనంగా మాట్లాడుతున్నారు.. మర్యాద కాదు !

.రౌడీలు కంటే హీనంగా మాట్లాడుతున్నారు.. మర్యాద కాదు !

ఇళ్ల పట్టల పంపిణీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని  టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. టిడ్కో లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లివ్వాలన్న ఆయన సెంటు, సెంటున్నర ఇంటి స్థలం పేదలకు ఏం సరిపోతుంది..? అని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ల పథకం నేను ప్రవేశపెట్టిన పథకం అని, ఇప్పుడు ఇంటికి లక్ష రూపాయలు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీసుకున్నారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బు ఇచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఫ్రస్ట్రేషన్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గాలి కబుర్లు చెబుతున్నారని ఆయన అన్నారు. నా ఇల్లు నా సొంతం ద్వారా పేదలకు ఇళ్లు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఇంటి పన్ను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారని దీన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశామని అన్నారు. రౌడీలు కంటే హీనంగా మాట్లాడుతున్నారన్న బాబు ఇది చట్టబసభలకు మర్యాద కాదన్నారు. ఇదేమిటని అడిగితే స్పీకర్ నాపై పేపర్లు విసిరేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం పై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం వచ్చిందని బాబు అన్నారు.