రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ యాత్ర చేసి తీరుతాం !

రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ యాత్ర చేసి తీరుతాం !

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కలలో ఉన్న పితాని సత్యనారాయణ స్వగృహానికి చంద్రబాబు వెళ్లారు. పితాని కుమారుడు భానుచందర్ వివాహం సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ 20 నెలల పాలనలో 1350 మంది టీడీపీ నాయకులు పై దాడులు చేసి 16 మంది నాయకులనుని పొట్టన పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రం పులివెందుల రాజ్యంగాను రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనుకుంటున్నారని అన్నారు. ఒకప్పుడు కరోనా సమయంలో ఎన్నికలు కావాలన్నారు ఇప్పుడు వద్దంటున్నారని బాబు విమర్శించారు. ఎన్నికలు కమీషన్ ను రాజీనామా చేయాలన్న సీఎం ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తారా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ యాత్ర చేసి తీరుతామని బాబు పేర్కొన్నారు. రాముడు తల నరికితే ముఖ్యమంత్రి గాని వైసీపీ నాయకులు గాని ఒక్కరు స్పందించలేదన్న ఆయన రాష్ట్రంలో తమకు వ్యతిరేఖంగా మాట్లాడిన వారి  పై అక్రమకేసులు బానాయిస్తున్నరని అన్నారు. రాష్ట్రంలో ఫోర్త్ ఎస్టేట్ ను అణగదొక్కాలని చూస్తున్నారని అన్నారు.