అమరావతి రైతులకు మద్దతుగా బాబు నిరసన దీక్ష... 

అమరావతి రైతులకు మద్దతుగా బాబు నిరసన దీక్ష... 

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయింది.  ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా   ఏర్పాటు చేసుకున్నారు.  అమరావతి రాజధానిని అద్భుతంగా తీర్చి దిద్దాలని అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అనుకున్నారు.  అయితే,   వివిధ రకాల కారణాల వలన కొన్ని పనులు మాత్రమే అక్కడ జారిగాయి.  

2019 ఎన్నికల్లో అధికారం చేతులు మారింది.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల విషయాని తెరపైకి తీసుకొచ్చింది. అమరావతిలో   చట్టసభలు, విశాఖలో పరిపాలన, కర్నూలులో హైకోర్టు ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.  రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు.  గ్రామాల్లో టెట్లు వేసుకొని నిరసనలు తెలియజేశారు.  కరోనా కాలంలో కూడా రైతులు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు.  అమరావతి రాజధానిని మార్చొద్దు అని చెప్పి  నిరసనలు మొదలుపెట్టి నేటికీ 200 రోజులు అయ్యింది.  దీంతో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు రాజధాని ప్రాంత గ్రామంలో ఎవరింట్లో వాళ్ళు నిరసన, నిరాహార దీక్షలు చేస్తున్నారు.  రైతులకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.   ఈ దీక్షలో అనేకమంది తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.