తట్టా బుట్టా సర్దుకున్నోళ్లు.. నన్ను విమర్శించేవాళ్లా..!!

తట్టా బుట్టా సర్దుకున్నోళ్లు.. నన్ను విమర్శించేవాళ్లా..!!

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన నీరు-ప్రగతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ, వైసీపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి అప్పులు మనచేతికి ఇచ్చారని.. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో ఏపీ సమానస్థాయికి రావడానికి కనీసం 9 ఏళ్లు పడుతుంది సీఎం అన్నారు. వైసీపీ నేతలు హోదా విషయంలో కేంద్రంతో పోరాడాల్సింది పోయి నన్ను విమర్శిస్తున్నారని.. తనను విమర్శిస్తే ప్రత్యేకహోదా వస్తుందా అని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

హోదా విషయంలో ఒక్క జగన్ మాత్రమే పోరాడుతున్నారని.. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు అంటున్నారు.. తట్టబుట్ట సద్దుకుని గోడదూకేందుకు రెడీ అయిన కన్నా లక్ష్మీనారాయణ నన్ను విమర్శిస్తున్నాడని..  పంచాయతీ బోర్డు మెంబర్లుగా గెలవలేని వ్యక్తులు నన్ను విమర్శిస్తున్నారని.. కాబట్టి ప్రజలు రాజకీయాలను అర్ధం చేసుకోవాలని సూచించారు. కేసుల కోసం రాజీపడిన వ్యక్తులు నన్ను విమర్శిస్తున్నారని.. బీజేపీ-వైసీపీలు లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నాయని రాబోయే ఎన్నికల్లో నీతిమంతులు, ప్రజామోదం పొందిన వారినే అభ్యర్థులుగా నిలబెడతానని సీఎం వెల్లడించారు.