రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో బాబు ధర్నా... 

రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో బాబు ధర్నా... 

చిత్తూరులో పర్యటించేందుకు చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అయితే, చిత్తూరు వెళ్లేందుకు అనుమతులు లేవని, చెప్పడంతో చంద్రబాబు నాయుడు ఎయిర్ పోర్టులోనే బైఠాయించారు.  లోపలే ధర్నాకు దిగారు.  తాను చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీని కలవాలని, కలిసేందుకు వెళ్తున్నానని చెప్పడంతో, వారిని ఎయిర్ పోర్ట్ దగ్గరకి పిలుస్తామని పోలీసులు తెలిపారు.  చంద్రబాబు మాత్రం అందుకు అంగీకరించలేదు.  తాను అంతటి గొప్పవాడిని కాదని, అడ్డుకొని తగిన గౌరవం ఇచ్చారని అన్నారు.