జగన్.. నా అనుభవమంత మీ వయసు : చంద్రబాబు

జగన్.. నా అనుభవమంత మీ వయసు : చంద్రబాబు

అసెంబ్లీ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అధికార  వైకాపా, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరిగింది.  మొదట్లో కాళేశ్వరాన్ని వ్యతిరేకించిన జగన్ ఎలా ప్రారంభోత్సవానిలోయ్ వెళ్లారని ప్రతిపక్ష నేతలు ప్రశించగా సీఎం సంధానం చెబుతూ నేను వెళ్లినా వెళ్లకపోయినా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరిగేదని, కానీ చంద్రబాబుగారు అధికారంలో ఉన్న ఐదేళ్లలోనే ఆ ప్రాజెక్ట్ కట్టడం జరిగిందని, అప్పుడు ఆయన గాడిదలు కాస్తున్నారా అని ప్రశించారు. 

ఆయన వ్యాఖ్యలను టీడీపీ నేతలందరూ ఖండించగా చంద్రబాబు నాయుడు సమాధానం చెబుతూ నా రాజకీయ అనుభవం అంత మీ వయసు.. అది మీరు గుర్తుపెట్టుకోవాలి.  అన్నీ మీకు తెలుసనీ విర్రవీగడం మంచిది కాదు.  కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే ఏపీ, తెలంగాణ.. ఇండియా, పాకిస్థాన్ అవుతాయని అన్నారు.  ఇప్పుడేమో మాట మార్చుకున్నారని అన్నారు.