తిరుపతి ఉప ఎన్నికపై బాబు ప్రత్యేక దృష్టి... రేపటి నుంచి... 

తిరుపతి ఉప ఎన్నికపై బాబు ప్రత్యేక దృష్టి... రేపటి నుంచి... 

తిరుపతి ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది.  ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి.  వైసీపీ, బీజేపీ కంటే ముందు నుంచే టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం చేస్తున్నది.  తిరుపతిలో తిరిగి విజయం సాధిస్తామని వైసీపీ చెప్తుంటే, విజయం తమదే అని టీడీపీ అంటోంది.  టీడీపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి కోసం టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.  నారా లోకేష్ తిరుపతిలో వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు.  ఇక రేపటి నుంచి చంద్రబాబు నాయుడు తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గంలో ప్రచారం చేయబోతున్నారు.  రేపటి నుంచి 8 రోజులపాటు అంటే ఈనెల 15 వ తేదీ వరకు ప్రచారం చేయబోతున్నారు.  పార్లమెంట్ పరిధిలోనే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహించబోతున్నారు.  బాబు 8 రోజులపాటు తిరుపతిలోనే ఉండి ప్రచారం చేయబోతుండటంతో ఈ ఉప ఎన్నికపై మరింత ఆసక్తి పెరిగింది.  మరి ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఉన్నారో మే 2 న తెలుస్తుంది.